7వ పోలీస్ బెటాలియన్‌లో హనుమాన్ జయంతి
NZB: డిచ్‌పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.