‘జగన్ హయాంలో రూ.104 కోట్లు స్వాహా చేశారు’

AP: వైసీపీ మంత్రులు ఆర్బీకేలకు నిధులు ఇవ్వకుండా స్వాహా చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆరోపించారు. జగన్ పాలనలో ఆర్బీకేల నిర్వహణలో నిధులు దుర్వినియోగమయ్యాయని, ఏడాదికి రూ.26 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.104 కోట్లు స్వాహా చేశారని ఆయన అన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు.