యువకుడి ప్రాణం తీసిన వీధికుక్కలు

యువకుడి ప్రాణం తీసిన వీధికుక్కలు

WGL: గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి శివకుమార్ (24) అర్ధరాత్రి ఒంటిగంటకు ఇంటికి తిరిగి వస్తుండగా, మచ్చాపురం-ఎలుకుర్తి మార్గంలో వీధి కుక్కలు అతని ద్విచక్ర వాహనాన్ని వెంబడించాయి. దీంతో బైక్ అదుపుతప్పి మట్టి దిబ్బను ఢీకొని రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.