జూన్ 9నుంచి ప్రత్యేక లోక్అదాలత్

జూన్ 9నుంచి ప్రత్యేక లోక్అదాలత్

KMM: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, తాలూకా న్యాయసేవాధికార కమిటీలతో కలిసి ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లు జూన్ 9నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. కక్షిదారులు సంబంధిత కోర్టులో వారి న్యాయవాదులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.