బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
NLG: చిట్యాలలోని ఓ మైనర్ బాలికను గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోచంపల్లి ఎస్సై సతిష్ తెలిపారు. నింధితుడు బాణాల రాకేష్ అనే యువకుడిగా గుర్తించారు. కోర్టు నింధితుడిపై 14 రోజుల రిమాండ్ విధించింది.