VIDEO: 'సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం'

E.G: సీపీఐ అగ్ర నాయకులు, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. శనివారం రాజమండ్రిలో వారు మాట్లాడుతూ.. సురవరం నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అన్నారు.