నేడు మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
NDL: వైసీపీ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జన్మదిన వేడుకలను నందికొట్కూరు పట్టణంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నేతలు, అధికారులు వెంకటస్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.