విశాఖ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు
విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కార్డిలియా క్రూయిజ్ నౌక జూన్ 24న విశాఖకు చేరుకుని పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ఐదు రోజుల సముద్ర యాత్ర నిర్వహించనుంది. జులై 1, 8, 15 తేదీల్లో కూడా సేవలు ఉంటాయని అధికారులు తెలిపారు. నౌకలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి.