శిథిలావస్థకు మహాత్మా గాంధీ విగ్రహం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గురువారం స్థానికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం.