'ధురంధర్2'లో మోదీ మేనియా
రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో ప్రధాని మోదీ కనిపించడంతో థియేటర్లన్నీ కేకలతో హోరెత్తుతున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోదీకి సంబంధించిన కొన్ని వాస్తవ దృశ్యాలను క్యామియో తరహాలో ఉపయోగించాడు. థియేటర్లలో ప్రేక్షకులు 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.