రైతు పత్తి డబ్బులు రాజన్న ఆలయ ఖాతాలోకి జమ
SRCL: వేములవాడలో ఓ మహిళా రైతు పత్తి అమ్మిన రూ. 2,14,549 అధికారుల తప్పిదంతో రాజన్న ఆలయం బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి. దీంతో తమ అకౌంట్‌లో నగదు జమకాకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాగా ఈ విషయం తెలిసింది. నెల కావొస్తున్నా అధికారులు దీనిపై స్పందించడం లేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది.