పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-2002 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల నేడు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు చదువు చెప్పిన గురువులను సత్కరించి ఆనందం వ్యక్తం చేశారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పరస్పరం అనుభవాలు పంచుకున్నారు.