పలు ఆలయాలను సందర్శించిన కేతిరెడ్డి దంపతులు
సత్యసాయి: కార్తీకమాసం 3వ సోమవారం సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి సుప్రియ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. జార్ఖండ్‌లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం, బసుకినాథ్ దేవాలయాన్ని సందర్శించారు. అలాగే 51 శక్తిపీఠాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.