VIDEO: మృత్యుకూడలిగా గుంటూరు శ్రీరామ్‌నగర్ రోడ్డు
GNTR: గుంటూరు నగరంలోని శ్రీరామ్‌నగర్ ప్రధాన రహదారి మలుపు వద్ద రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వరుసగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో, ప్రమాదాలను నివారించేందుకు స్థానికులే కర్రలతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.