కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు డీలక్స్ బస్సు
NGKL: కల్వకుర్తి RTC డిపో నుంచి హైదరాబాద్‌కు డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుభాషిణి తెలిపారు. ఈ బస్సు ఆమనగల్, హైద్రాబాద్‌లో మాత్రమే ఆగుతుందన్నారు. ఈ బస్సు ప్రతిరోజు కల్వకుర్తి నుంచి ఉదయం 7:40 నిమిషాలకు, మధ్యాహ్నం 12:30 నిమిషాలకు, సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.