తాండూరు మండలంలోని 12 గ్రామాల్లో సౌర దీపాల
VKB: తాండూరు మండలంలోని 12 గ్రామాల్లో సౌర వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు బెంగళూరులోని PDWC, యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అందుకు అవసరమైన స్తంభాలు, సౌర దీపాలు, తీగలు వంటి సామగ్రిని ఇవాళ మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. ఈ పనులు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండు వారాల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.