గురజాల మండల టీడీపీ కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ

PLD: గురజాల మండల టీడీపీ కన్వీనర్‌గా మరోసారి పులిపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బుధవారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి టీడీపీ మండల కన్వీనర్‌గా నియమించినందుకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.