సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
VZM: దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1వ తేదీన పర్యటిస్తున్న నేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. హెలిపాడ్ స్థలంతో పాటు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.