VIDEO: వార్డు సభ్యులపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో వార్డు సభ్యులపై సర్పంచ్ భర్త జక్కి శ్రీకాంత్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ సమావేశంలో బిల్లు అంశంపై వాగ్వాదం చెలరేగి, 12వ వార్డు సభ్యుడు నాగరాజు, 3వ వార్డు సభ్యుడు ప్రశాంత్‌పై దాడి చేశాడని బాధితులు బుధవారం తెలిపారు. బాధితులు నిందితుడిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.