దీప కాంతులతో వెలిగిపోతున్న ఆలయం
ATP: తాడిపత్రిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి డ్రోన్ల ద్వారా తీసిన అద్భుతమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రివేళ దీప కాంతులతో వెలిగిపోతున్న ఆలయ దృశ్యాలను భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు.