ఆలస్యంగా వస్తున్న 100 మంది టీచర్లు..!
CTR: చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. అయితే టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. అనంతరం టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. అయితే ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.