ఫ్రీ బస్ ప్రారంభించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో ఫ్రీ బస్ పథకం అమలులోకి వచ్చింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక పూజలు చేసి జొన్నవాడ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రారంభించామని చెప్పారు.