CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KRNL: కోడుమూరులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇవాళ రూ. 6, 87, 915 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పసుపుల ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. హరిత, కురువ ఫణింద్ర, శ్రీనివాస రెడ్డి, తదితర లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎంకు, కేడీసీసీబీ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.