పొలం దున్నుతుండగా బయటపడ్డ సూర్య చంద్ర విగ్రహాలు

పొలం దున్నుతుండగా బయటపడ్డ సూర్య చంద్ర విగ్రహాలు

MNCL: దండేపల్లి మండలంలోని మేదరిపేట శివారులో అద్భుతం చోటు చేసుకుంది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపంలోని పంట పొలంలో బుధవారం పొలం దున్నుతుండగా సూర్య, చంద్ర విగ్రహాలు బయటపడ్డాయి. ఒకేరాయిపై ఈ విగ్రహాలు చెక్కబడి ఉండటం విశేషం. దీంతో విగ్రహాలను చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. విగ్రహాలకు పూజలు చేస్తున్నారు.