పీలేరులో నిర్భంద తనిఖీల నిర్వహణ
అన్నమయ్య జిల్లా పీలేరులో డీఎస్పీ కృష్ణమోహన్ నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 64 ద్విచక్రవాహనాలు, ఒక ఇన్నోవా, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.