విజ్ఞాన మందిరంలో ట్రాఫిక్ భద్రత అవగాహన సదస్సు

విజ్ఞాన మందిరంలో  ట్రాఫిక్ భద్రత అవగాహన సదస్సు

GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సోమవారం గుంటూరు విజ్ఞాన మందిరం సెంటర్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ డిఎస్పీ పర్యవేక్షణలో CI ఎ. అశోక్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ప్రయాణీకులు, ఆటో-రిక్షా డ్రైవర్లు, వ్యాపారస్తులు, స్థానికులకి CI అశోక్ కుమార్ ముఖ్య సూచనలు ఇచ్చారు.