కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
ఏలూరు నగరపాలక సంస్థలో రమేష్ (35) అవుట్సోర్సింగ్ విధానంలో జెసిబి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇతను ప్రస్తుతం ఏలూరు చాణక్యపురి కాలనీలో భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. బుధవారం ఏలూరు అశోక్ నగర్ స్మృతి వనంలో జెసిబితో శుభ్రం చేసే పనులు చేస్తూ ఉండగా విద్యుత్ వైర్లకు తగిలి షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.