బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం

బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం

కృష్ణా: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉయ్యూరులో గల శివాలయం రోడ్‌లో నలుగురు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఓ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ కడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.