VIDEO: లింగంపేటలో లీక్ అవుతున్నపైప్ లైన్

AKP: గొలుగొండ మండలం, లింగంపేట గ్రామంలో గురువారం వేసిన కరెంట్ స్తంభాల వల్ల లీక్ అవుతున్న పైప్ లైన్. విద్యుత్ శాఖ వారు కరెంట్ స్తంభాలు వేయడం కోసం గుంతలను తవ్వగా రెండు మూడు చోట్ల వాటర్ పైప్స్ డ్యామేజ్ అవ్వడంతో నీరు మొత్తం రోడ్లమీద పారుతుంది. దీనివల్ల గ్రామాలకి నీరు కూడా అందడం లేదని అధికారులు స్పందించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.