రోడ్డుపై మట్టి తొలగించాలని విజ్ఞప్తి
నాగర్‌కర్నూల్ జిల్లా బస్‌స్టాండ్ కూడలిలోని ప్రధాన రహదారిపై రోడ్డు మరమ్మతులు చేసిన తర్వాత, తొలగించాల్సిన మట్టిని అధికారులు అలాగే వదిలేశారు. బస్‌స్టాండ్ ప్రధాన రహదారిపై మట్టి కుప్పలు పేరుకుపోవడంతో అటుగా వచ్చిపోయే వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో మట్టిని తొలగించాలని ప్రజలు, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.