బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
MBNR: రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన చాకలి శ్రీశైలం అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు చించోడు అభిమన్యు రెడ్డి సూచన మేరకు స్థానిక నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన అందించిన రూ. 5 వేలను బాధిత కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులోను కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.