'పశువులకు గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి'
SRCL: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్య అధికారి అభిలాష్ రైతులకు సూచించారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. అధికారి మాట్లాడుతూ.. మూగ జీవాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి పశుపోషకులు టీకాలు వేయించాలని సూచించారు.