గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
WGL: రాయపర్తి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. సరిత ఆదివారం గురుకులాల్లో 5వ నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరారు. జనవరి 21లోగా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత వసతి, భోజనం అందిస్తామని చెప్పారు.