రేపటితో డెడ్‌లైన్ ముగుస్తుంది: కేంద్రం

రేపటితో డెడ్‌లైన్ ముగుస్తుంది: కేంద్రం

మావోయిస్టులకు రేపటితో డెడ్‌లైన్ ముగుస్తుందని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. స్వచ్ఛందంగా మావోయిస్టులు లొంగిపోతే పునరావసం కల్పిస్తామని వెల్లడించింది. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చింది. దేశంలో 7 జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రభావం ఉందని తెలిపింది. ఇప్పటివరకు 16,496 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ ఏడాదిలో 2,337 మంది తమ ఆయుధాలను వదిలిపెట్టారని పేర్కొంది.