ముంచెత్తిన భీమసముద్రం.. రాకపోకలు బంద్

ముంచెత్తిన భీమసముద్రం.. రాకపోకలు బంద్

SKLM: భారీ వర్షాల కారణంగా భీమసముద్రం గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో ఇచ్ఛాపురం పుర పరిధిలోని రత్తకన్న వద్ద వరద నీరు కాజ్ వే రోడ్ మీదుగా ప్రవహించడంతో రత్తకన్న-బిర్లంగి మధ్య రవాణా పూర్తిగా స్తంభించింది. ఈ వరద నీటితో సుమారు 500 ఎకరాల్లో సాగు చేసిన వరిపంట నీటమునిగి తీవ్రంగా నష్టపోయింది.