10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయింది: MLA
MHBD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం పలు కాలనీల్లో MHBD MLA డా. భూక్యా మురళీ నాయక్ గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా MLA ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ పథకాలను వివరించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, కేటీఆర్ సమస్యలు పరిష్కరించకుండా విషం కక్కుతున్నారని MLA మండిపడ్డారు.