శిక్షణ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ

శిక్షణ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ

AKP: అనకాపల్లి-కొత్తూరులో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైన్యూర్ ఆఫ్ ఇండియా నిర్మిస్తున్న పరిపాలన భవనంతో పాటు శిక్షణ కార్యాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం భూమి పూజ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. చిన్న పరిశ్రమలు స్థాపనకు శిక్షణ కూడా ఇస్తారన్నారు.