వినుకొండలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

వినుకొండలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

PLD: శావల్యాపురం మండలం కారు మంచి గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గురువారం ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వైద్య బృందం పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చింది.