యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ
BHNG: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. కొండకింద కళ్యాణ కట్ట, వ్రత మండపం, కొండపైన ఆలయ పరిసరాలు, తిరువీధులు భక్తులతో సందడిగా మారాయి. గర్భాలయంలోని లక్ష్మీనరసింహుని దర్శనానికి భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఆర్జిత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.