ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ

ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఏఈ - ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది వైభవ్‌కు పొట్టి ఫార్మాట్‌లో రెండో శతకం. కాగా పద్నాలుగేళ్ల 232 రోజుల (అతి పిన్న) వయసులో 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.