నేడే నీట్ పరీక్ష.. మధ్యాహ్నం1:30 గంటల వరకే అనుమతి

SRD: జిల్లాలో నేడు జరిగే నీట్ పరీక్షకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకే అనుమతి ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 3,320 మంది పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వాహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.