రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
JN: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల గణపురం మండలం చీటురు గ్రామం సమీపంలోని అప్పిరెడ్డి ఎక్స్ రోడ్డ్ వద్ద చోటుచేసుకుంది.ఈ రోడ్డు ప్రమాదంలో డీసీఎం బోల్తా పడి డ్రైవర్ మహ్మద్ జహీర్ ఉద్దీన్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.