'ప్రజా సమస్యల పోరాటాలకు సీపీఐకి చేయూత నివ్వండి'
SRPT: నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐకి ప్రజలు అండగా నిలిచి విరాళాలు అందించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేటలో పీఎస్ఆర్ సెంటర్‌లో ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సాధన కోసం పార్టీ శ్రమిస్తోందని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.