'ఆయ్' డైరెక్టర్‌తో హీరో నితిన్ మూవీ
హీరో నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ, నాగవంశీ నిర్మాణంలో ఓ సినిమా లైనప్‌లో ఉండగా.. తాజాగా 'ఆయ్' దర్శకుడు అంజి కె. మణిపుత్రతో తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి ఈ మూవీని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా, షూటింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.