విద్యార్థులు ఇష్టంతో చదవాలి:మంత్రి

NGKL: ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు సూచించారు. బోధ్‌లో సాంఘికసంక్షేమ బాలికల కళాశాల, పాఠశాల తరగతి గదులను మంత్రి గురువారం ప్రారంభించి మాట్లాడారు. కష్టాలు భరించి చదివిస్తున్న తల్లిదండ్రులకు మీ విజయాలే వారికి గొప్ప బహుమతులు అని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మంత్రి సూచించారు.