అలంకార ప్రాయంగా సెల్ టవర్

అల్లూరి: గ్రామాల్లో సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఇవి సరిగా పనిచేయక వినియోగదారులు తరచూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి సిగ్నల్ సమస్య తలెత్తుతోంది. వీటిని తిరిగి సంబంధిత అధికారులు పునరుద్ధరించిన రోజుల వ్యవధిలోనే అవి మామూలవుతున్నాయి. అనంతగిరి మండలంలో కొండిబ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది.