సత్తుపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా సాలి శివకృష్ణ

KMM: సత్తుపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా సాలి శివకృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్ర, సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి శివకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.