రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి ప్రతిభ
NZB: వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి అండర్-17 కేటగిరీ 65 కేజీల విభాగంలో ZPHS విద్యార్థి విస్లావత్ సిద్ధూ మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెడ్ మాస్టర్ సీతయ్య తెలిపారు. ఈ మేరకు నిన్న సాయంత్రం వారు జిల్లా విద్యా అధికారి అశోక్‌ను కలిశారు. అనంతరం PD స్వప్న, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, సిద్ధూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.