వెంటనే రహదారులను బాగు చేయండి సారూ..!
WGL: రాయపర్తి మండలంలోని రహదారులన్నీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అధ్వానంగా మారాయి. ముఖ్యంగా బురహాన్‌పల్లి-కాట్రపల్లి ప్రధాన రోడ్డు భారీ కోతకు గురయ్యాయి. ప్రమాదాలు జరగకుండా స్థానికులే రాళ్లు పెట్టి, తెలుపు రంగు వేసి హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేశారు. వర్షాలు ఆగి చాలా రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.