రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
NLR: కోవూరు మండలం పడుగు పాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన యువకుడు కోవూరు రైల్వే రోడ్డుకు చెందిన శ్రీనివాసులు (27)గా రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.